సూపర్ హిట్ ఈ వారం ఈ – మ్యాగజైన్ విశేషాలు

0
168
ఈ వారం

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

1. మూడవ వారం లోకి సక్సెసఫుల్ గా అడుగుపెట్టిన మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ క్రాకింగ్ బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్ ప్రత్యేక పోస్టర్.

2. యువ హీరో నాగ శౌర్య బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ మూవీ లక్ష్య ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.

3. మాస్ మహారాజ రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

4. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత మహేష్ ఘట్టమనేని బర్త్ డే సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

5. మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్ 10 రోజుల ప్రత్యేక పోస్టర్.

6. ఫిబ్రవరి 2 నుండి రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ ఫస్ట్ షెడ్యూల్ మొదలు కానున్న సందర్భంగా ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

7. యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ లైగర్ ఫస్ట్ లుక్ పోస్టర్.

8. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయిన మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా గురించిన పలు విశేషాలు.

9. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గని ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి ట్రమెండస్ రెస్పాన్స్. మరియు ఆ సినిమా విశేషాలు.

10. యువ హీరో నాగ శౌర్య బర్త్ డే సందర్భంగా వరుడు కావలెను మూవీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్, మరియు ఆ మూవీ ప్రత్యేక పోస్టర్.

11. ప్రముఖ హీరో, కమెడియన్ అలీ నటిస్తూ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీలో తొలిసారిగా కలిసి నటిస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డి, కె అచ్చిరెడ్డిల ప్రత్యేక పోస్టర్.

12. మాస్ మహారాజ రవితేజ గారితో తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్ తో హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆ మూవీ గురించి పలు విశేషాలు వెల్లడించిన దర్శకుడు గోపీచంద్ మలినేని.

13. అల్లుడు అదుర్స్ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్ : మూవీ సక్సెస్ మీట్ లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, మరియు ఆ కార్యక్రమ విశేషాలు.

14. మాస్ మహారాజ రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన మూవీ కెరీర్ గురించిన పలు విశేషాలు.

15. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఐరా సినిమాస్ వారి లేటెస్ట్ మూవీస్ ఓపెనింగ్స్ మరియు వాటి గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

16. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్ 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

17. రామ్ నటించిన రెడ్ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది : నిర్మాత స్రవంతి రవికిశోర్, మరియు ఈ మూవీ సక్సెస్ మీట్ విశేషాలు.

18. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా తెరకెక్కిన ఎఫ్ సి యు కె మూవీ తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుదని ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర సంగతులు వెల్లడించిన విలక్షణ నటుడు జగపతి బాబు.

19. సముద్ర దర్శకత్వంలో నటుడు సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జైసేన మూవీ ఈనెల 29న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

20. 100% ఎంటర్టైనర్ గా రూపొందిన నా లేటెస్ట్ మూవీ బంగారు బుల్లోడు తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుంది : ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లరి నరేష్, మరియు ఆ కార్యక్రమ విశేషాలు.

21. సక్సెస్ఫుల్ గా 11 రోజులకు పైగా మంచి కలెక్షన్ తో దూసుకెళ్తున్న ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ మూవీ ప్రత్యేక పోస్టర్.

22. నా జీవితంలో ఇది మరిచిపోలేని పుట్టినరోజు అంటూ తన కెరీర్ గురించిన పలు ఆసక్తికర సంగతులు వెల్లడించిన సీనియర్ యాక్టర్ వికె నరేష్ .

వీటితో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2968126/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-5th-Feb-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here