యాక్షన్ హీరో విశాల్, ఆర్య కాంబినేషన్‌లో రూపొందుతోన్నభారీ మల్టీస్టారర్ `ఎనిమి`. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. విశాల్‌కు ఇది 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ చిత్రం. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. గద్దలకొండ గణేష్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నఈ చిత్రం నుండి యాక్షన్ హీరో విశాల్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో గన్ పట్టుకొని కిందకు సీరియస్‌గా చూస్తున్న ఈ లుక్ విశాల్ అభిమానులని ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ మూవీ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మేకర్స్.
యాక్షన్ హీరో విశాల్, ఆర్య, మృణాళిని రవి, ప్రకాశరాజ్ తదితరులు నటిస్తోన్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆర్ డి రాజశేఖర్, సంగీతం: తమన్ ఎస్ ఎస్, ఆర్ట్: టి. రామలింగం, ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్టా, యాక్షన్: రవివర్మ, నిర్మాత: వినోద్ కుమార్, దర్శకత్వం: ఆనంద్ శంకర్.



