మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ ఈ వారం విశేషాలు

0
522

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

1.రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘సలార్’ ఫస్ట్ లుక్ పోస్టర్. మరియు ఆ సినిమా విశేషాలు.

2. యువ నటుడు నాగశౌర్య హీరోగా వెంకటేశ్వర సినిమా ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారి లేటెస్ట్ మూవీకి ‘లక్ష్య’ టైటిల్ ఖరారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్. మరియు ఆ సినిమా గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

3. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న హైదరాబాదీ అమ్మాయి అమ్రీన్ ఖురేషి ప్రత్యేక పోస్టర్.

4. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ లేటెస్ట్ పోస్టర్.

5. టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ జన్మదినం సందర్భంగా ఆయన మూవీ కెరీర్ గురించిన ప్రత్యేక విశేషాలు.

6. రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ కలిసి నటించిన లేటెస్ట్ యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ఇటీవల ఆహా ఓటిటి మాధ్యమం లో రిలీజ్ అయి మంచి సక్సెస్ కొట్టింది. కాగా ఈ సినిమా 2021, జనవరి 1 న థియేటర్స్ లో రిలీజ్.

7. అఖిల్, పవర్ స్టార్ లతో రెండు క్రేజీ ప్రాజక్ట్స్ కోసం సిద్దమవుతున్న టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మూవీ కెరీర్ విశేషాలు.

8. శ్రీవిష్ణు హీరోగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న గాలి సంపత్ మూవీ విశేషాలు. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా అలానే స్క్రీన్ ప్లే ని అందిస్తుండగా అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు.

9. ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్న సాయి రోనక్, మరియు ఆ సినిమా గురించి పలు విశేషాలు.

10. క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కపటధారి’ మూవీ ప్రత్యేక పోస్టర్.

11. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మేజర్’ మూవీ నుండి హీరో అడివి శేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మరియు ఆ సినిమా విశేషాలు.

12. ఈనెల 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న మెగాసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రత్యేక పోస్టర్, మరియు ఆ మూవీ గురించిన పలు విశేషాలు.

13. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.
తో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన ఈ వారం సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!
http://superhit.industryhit.com/2912839/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-18th-Dec-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here