విజయ్‌ ఆంటోని లేటెస్ట్‌ మూవీ విజయ రాఘవన్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

0
583

‘నకిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న విజయ్‌ ఆంటోని హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ రూపొందిస్తోన్న చిత్రం ‘కోడియిల్‌ ఒరువన్‌(కోటికొక్కడు)’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విజయ రాఘవన్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఎత్తైన భవనాల సముదాయంపై స్టైల్‌గా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న విజయ్‌ ఆంటోని ఫొటోను ఫస్ట్‌లుక్‌గా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో చాలా ఇన్‌టెన్స్‌ లుక్‌తో విజయ్‌ ఆంటోని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here