మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `ఆచార్య`. మెగాస్టార్ 152వ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చిత్రీకరణను పునః ప్రారంభించడానికి చిత్రయూనిట్ సిద్ధమైంది. నవంబర్ 9నుండి `ఆచార్య` షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ పూర్తవుతుంది.
కొరటాల శివ అండ్ టీమ్ కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా స్మూత్‌గా షూటింగ్‌ను పూర్తి చేయడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.
మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగినట్లు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సురేశ్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.