రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించి ఇప్పుడు సినీ రంగంలోకి `రావణలంక` చిత్రంతో హీరోగా నిర్మాతగా అడుగు పెడుతున్నారు క్రిష్. కే సిరీస్ బేనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి బిఎన్ఎస్‌రాజు దర్శకత్వం వహించారు. రేపు క్రిష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్.
ఈ కార్యక్రమంలో. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ… చిన్న చిత్రాల్ని, మంచి చిత్రాల్ని అందరూ తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. కొత్త హీరోలను ఎంకరేజ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి మరింత మంది కొత్త హీరోలు వస్తారు. క్రిష్‌గారు సినిమా రంగంపై ఎంతో ఆసక్తితో స్వయంగా సినిమాని నిర్మించాలని ముందుకు రావడం చాలా గ్రేట్. త్వరలోనే సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా“ అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… ఈ రోజు రఘుపతివెంకయ్యనాయుడు పుట్టినరోజు ఆయన్నిఓసారి గుర్తు చేసుకుందాం. కరీంనగర్ పైడిరాజుగారి ఇన్‌స్పిరేషన్‌తో క్రిష్ సినిమాల్లోకి వచ్చారు. రావణలంక అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాగైతే సక్సెస్ అయ్యారో సినిమాల్లో కూడా అలాగే సక్సెస్ కావాలని కోరుకుంటున్నా“ అన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – “ రావణలంక సినిమా బాగా ఆడి నటుడిగా,నిర్మాతగా క్రిష్‌కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
చిత్ర దర్శకుడు బిఎన్ఎస్‌రాజు మాట్లాడుతూ… రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ప్రతి పాత్ర చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే ఇటీవల ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదలచేయగా రెండు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ విడుదలచేస్తాం. మా హీరో క్రిష్‌గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇదే మొదటి పుట్టినరోజు మా టీమ్ అందరి తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు“అన్నారు.
హీరో క్రిష్ మాట్లాడుతూ – ఈ స్క్రిప్ట్ మీద నేను సంవత్సరం పాటు పని చేశాను. ప్రతిదీ చాలా ప్రొఫెషనల్‌గా వెళ్ళాం. సిమ్లా, మనాలి, గోవా, హైదరాబాద్ , సిసు సౌత్‌లో వంటి అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో నేను ఆగిపోను. ఇంకా ఎన్నో చిత్రాలను తీస్తాను. ఈ మూవీ తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది“ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డ్ చైర్మన్ శివకుమార్, కిరణ్, గోవింద్ (క్రిష్ స్నేహితులు)హీరోయిన్ గరీమా తదితరులు పాల్గొన్నారు. క్రిష్, అశ్మిత, త్రిష, మురళిశర్మ, దేవగిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత: క్రిష్ బండిపల్లి, మ్యూజిక్: ఉజ్జల్, సినిమాటోగ్రపీ: హజరత్‌షేక్ (వలి) ఎడిటర్: వినోద్ అద్వయ్, కోడైరెక్టర్: ప్రసాద్, డైరెక్టర్: బిఎన్ఎస్‌రాజు.



