సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురు ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలో ఘట్టమనేని కుటుంభం

0
67

సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరి సంద‌డి చేసింది. కృష్ణ చిన్న కూతురు ప్రియ‌ద‌ర్శిని పుట్టిన‌రోజు వేడుకల‌ను కృష్ణ‌-మ‌హేశ్ అండ్ ఫ్యామిలీ ఘ‌నంగా నిర్వ‌హించింది. సుధీర్ బాబు నివాసంలో ప్రియ‌ద‌ర్శిని కుటుంబ‌స‌భ్యులంద‌రి స‌మ‌క్షంలో బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేసింది. ఫ్యామిలీ మెంబ‌‌ర్స్ అంతా ఒక్కొక్క‌రిగా ప్రియ‌ద‌ర్శినికి కేక్ తినిపించి శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఆ త‌ర్వాత అంతా క‌లిసి భోజ‌నం చేశారు. ‌ కృష్ణ‌-ఇందిర దంపతులు,  మ‌హేశ్‌-నమ్ర‌త‌, ప్రియ‌ద‌ర్శిని-సుధీర్ బాబు, మంజుల-సంజ‌య్ స్వ‌రూప్‌, ప‌ద్మావ‌తి-జ‌య‌దేవ్ గ‌ల్లా ఈ పుట్టిన‌రోజు వేడుక‌ల్లో పాల్గొన్నారు.

సుధీర్ బాబు తన స‌తీమ‌ణి ప్రియ‌ద‌ర్శినికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ‘ఈ రోజు నా జీవితానికి ఒక‌ ప్రేమ పుట్టిన‌రోజు. ప్రియ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు’ అని సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here