జ‌న‌సేనాని పవన్ కల్యాణ్ తో ప్రముఖ నటుడు సుదీప్ భేటీ

0
666

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ ని ప్రముఖ నటులు, కన్నడ కథానాయకుడు సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కల్యాణ్ కార్యాలయానికి శ్రీ సుదీప్ వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి… ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే…ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here