నితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ చిత్రం ”చెక్”

0
478

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకం పైవి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో రకుల్ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు.

‘ చెక్ ‘ టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ– ”చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది . ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశ లో ఉంది ” అని చెప్పారు.

నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ– ” నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లోసినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్పెడతారనేది చివరి వరకూ తెలియదు. ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం కనిపిస్తుంది. చంద్రశేఖర్ యేలేటిమేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పంథాలోనే ఉంటూవాణిజ్య అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియావారియర్ ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి.రకుల్ ఇంతకు ముందు మా సంస్థ లో’లౌక్యం’ చేసింది. ప్రియా వారియర్ కి తెలుగు లో ఇదే తొలి చిత్రం. ఈ నెల 12 నుంచినెలాఖరువరకూ షెడ్యూల్ చేస్తాం. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది. ఇతరవిశేషాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని తెలిపారు.

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ,త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్,

సిమ్రాన్ చౌదరి తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here