ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే తన ఎనర్జిటిక్ పెర్‌ఫామెన్స్‌తో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా..విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించారు. అక్టోబర్1 సాయంత్రం 6గంటలనుండి తెలుగు ఓటీటీ ఆహాలో విడుదలకానుంది ఈ సందర్భంగా యంగ్ హీరో రాజ్ తరుణ్ వెబినార్‌లో చెప్పిన విశేషాలు..
ఒరేయ్ బుజ్జిగా..రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ చేశాక వాయిదాపడి ఇప్పుడు ఓటీటీలో విడుదలవుతుంది కదా ఎలా అన్పిస్తోంది?
– మార్చి 25 సినిమా రిలీజవుతుంది అనుకుని ప్రమోషన్స్ చేశాం. ఇంతలో కరోనా విజృంభించడంతో మార్చి22 లాక్‌డౌన్ మొదలైంది. మా సినిమా వాయిదా పడడంతో కొంత బాధ వేసిన మాట నిజమే.. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఓటీటీ కూడా బెస్ట్ ఫ్లాట్ ఫామ్. ఎందుకంటే వరల్డ్‌వైడ్ గా సినిమా చూస్తారు. ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో చేరువైన ఆహాలో విడుదలవుతున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలి అనే ఉద్దేశ్యంతోనే సినిమా చేశాం. ఫైనల్ గా అది నెరవేరుతున్నందుకు టీమ్ అందరం హ్యాపీ..
ఈ సినిమాలోకి మీరు ఎలా ఎంటరయ్యారు?
– విజయ్ గారు ఈ కథ మీద చాలా రోజులు వర్క్ చేశారు. ఫైనల్‌గా నేను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్అయ్యాను. విజయ్‌గారు ఈ కథ నరేట్ చేస్తున్నప్పుడే నేను చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గానే సాగుతుంది. కథ చెప్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ను జనాలదగ్గరకు తీసుకెళ్తే బాగుంటుదనిపించి వెంటనే ఈ మూవీ ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నంధ్యాల రవి, మధు కూర్చొని స్క్రిప్ట్‌ని ఇంకా బెటర్‌గా చేశారు.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
– నేను ఇదివరకు మూడు నాలుగు సినిమాలు కొంచెం కొత్తగా ట్రై చేశా. అయితే మళ్లీ నా కంఫర్ట్ జోనర్‌లోకి వచ్చి చేస్తోన్న చిత్రమిది. కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు తర్వాత నేను అంతలా కామెడీ చేసిన మూవీ ఇదే. నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా డిజైన్ చేశారు దర్శకుడు. సినిమా మొత్తం ఒక పక్కింటి అబ్బాయిలా ఫుల్ లెంగ్త్ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను.
మాళవికా నాయర్, హెభా పటేల్ వీరిద్దరి క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండబోతున్నాయి?
– మాళవిక ఇంతవరకూ కొంచెం సీరియస్‌గా ఉండే క్యారెక్టర్స్ చేసింది. అయితే ఈ సినిమాలో మాకు ఒక మంచి ఫెర్‌ఫార్మర్ కావాలి అని తనని ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమాలో మాళవికని ఒక కొత్త కోణంలో చూస్తారు. షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అలాగే ఈ సినిమాలో హెబా క్యారెక్టర్ చాలా పాష్‌గా ఉంటుంది.
సెట్లో దర్శకుడు విజయ్ ఎలా ఉంటారు?
– ఆయన చాలా డిసిప్లేన్డ్‌గా, చాలా కూల్‌గా ఉంటారు. ఒక సెట్‌బాయ్ వచ్చి ఏదైనా సలహా ఇచ్చినా ఆయనకు నచ్చతే బాగా చెప్పావురా అని తీసుకుంటారు లేదంటే వద్దులేరా అని సింపుల్‌గా చెప్తారు అంత కంఫర్ట్‌గా ఉంటారు. క్రియేటివ్ ఈగోలాంటివేమి ఆయనకు ఉండవు. ఏదైనా విషయం ఉంటే నేను, మధు గారు, మా రైటర్ నంధ్యాల రవి గారితోనూ కూర్చుని డిస్కస్ చేస్తారు. ఇంత వరకూ ఆయన సెట్లో టెన్షన్ పడడం మే ఎవ్వరం చూడలేదు. ఆయనకు ఏం కావాలి అనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటారు అందుకే ఆయన చాలా స్పీడ్ గా వర్క్ ఫినిష్ చేస్తారు.
ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి?
– ఒకటికాదండీ చాలా సీన్స్ ఉన్నాయి. ఒకటేమిటంటే మీరు మాళవిక వాళ్ల డాడీని మందు అడిగే సీన్ మీరు టీజర్‌లో చూసే ఉంటారు దాని తర్వాత వచ్చే సీన్ చాలా హిలేరియస్ గా ఉంటుంది. అలాగే సెకండాఫ్‌లో ఒక పదమూడు నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ మొత్తం మీరు కడుపుబ్బానవ్వుకుంటారు.
ఈ సినిమాలో కామెడీతో పాటు మీ డ్యాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావన వస్తోంది?
– శేఖర్ మాస్టర్ విజయ్ పట్టుబట్టి నాతో ఈ సినిమాలో ఒక పాటకి డ్యాన్స్ వేయించారు. ఆ పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం విజయ్ కుమార్ గారితో మరో సినిమా చేస్తున్నాను. అలాగే శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా, సంతోష్ అని నూతన దర్శకుడితో ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్‌లో డ్రీమ్ గర్ల్ రీమేక్ చేస్తున్నాను. వీటితో పాటు మరో రెండు కథలు లాక్ చేసి పెట్టాను. కథ నచ్చితే వెబ్ సిరీస్ లు చేయడానికి సిద్దమే. అలాగే వాలి సినిమాలో అజిత్, ప్రేమ చదరంగం సినిమాలో భరత్ లాంటి నెగెటివ్ క్యారెక్టర్స్ చేయాలనుంది.