కొవిడ్ ఆసుపత్రికి హిందూపూర్ ఎమ్మెల్యే నటసింహ నందమూరి బాలకృష్ణ వితరణ. రూ.55 లక్షల మందులు ,పరికరాలు అందిస్తానని ప్రకటన

0
362
అగ్ర క‌థానాయ‌కుడు, హిందూపురం శాస‌న‌స‌భ్యుడు

స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆసుపత్రికి కొవిడ్ వ్యాధి గ్రస్తుల కరోనా వైరస్ నివారణకు బారీగా మందులు పరికరాలు అందిస్తానని ప్రకటన విడుదలైంది. ఆదివారం స్థానిక చౌడేశ్వరి కాలని యందుగల ఎమ్మెల్యే నివాసంలో తెలుగు దేశం పార్టీ నాయకులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీనియర్ నాయకులు ఆహుడా మాజీ చైర్మన్ అంబికా లక్ష్మీ నారాయణ, పట్టణ అధ్యక్షుడు డి ఇ రమేశ్ కుమార్, మాజీ మునిసిపల్ చైర్మెన్ జే వి అనిల్ కుమార్, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు దేమకేతేపల్లి అంజినప్ప, సీనియర్ నాయకులు నాగరాజు, బేవినహళ్లీ ఆనంద్, త్యాగరాజ నగర్ వెంకట రమణ,నంబూరి సతీష్, మాజీ సర్పంచ్ లేపాక్షి జయప్ప తదితర నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవిడ్ ఆసుపత్రికి కావలసిన రూ దాదాపు రూ 8 లక్షల విలువైన. పరికరాలు అందించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా కరోనా బాధితులకు రూ 47 లక్షల విలువైన మందులు అందించడం జరుగుతుందని చెప్పారు. మొత్తం రూ 55 లక్షల విలువైన మందులు, పరికరాలు ఎమ్మెల్యే చేతులు మీదిగా ఆసుపత్రి వైద్యులకు అందిస్తామని ప్రకటించారు ఇదివరలో కూడా రూ 25 లక్షల విలువ ఆధారిత కలిగిన రెండు వెంటిలేటర్స్ అందించామని నాయకులు గుర్తు చేసారు. ఈ మొత్తం అంతా ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఆర్థిక సహాయం చేశారని నాయకులు గుర్తు చేసారు. ఇంత క్లిష్ట సమయంలో ఎమ్మెల్యే స్థానిక ప్రజల పట్ల సహాయ సహకారాలు అందిస్తామని తెలుపడం హర్షించదగ్గ విషయం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here