ఆ ఐకానిక్ సిక్స‌ర్‌ను నేను ఎలా మ‌ర‌చిపోగ‌ల‌ను టేక్ ఎ బౌ ఎం.ఎస్‌.ధోని’- సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు

0
599
సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స్పంద‌న

టీమ్ ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని శ‌నివారం త‌న రిటైర్‌మెంట్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ క్రికెట్‌కు ధోని చేసిన సేవ‌ల‌ను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయ‌న భ‌విష్య‌త్ బావుండాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ట్విట్ట‌ర్ ద్వారా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ‘‘2011లో ఇండియాను క్రికెట్‌ విశ్వ‌విజేత‌ నిలిపిన ఆ ఐకానిక్ సిక్స‌ర్‌ను నేను ఎలా మ‌ర‌చిపోగ‌ల‌ను!! నేను ఆ స‌మ‌యంలో వాంఖేడియం స్టేడియంలోనే నిలుచున్నాను. గ‌ర్వంగా ఉంది. క‌న్నీళ్లు వ‌స్తున్నాయి. క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. టేక్ ఎ బౌ ఎం.ఎస్‌.ధోని’’ అని తెలిపారు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here