“దేవేరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువత కు ఉపాధి అంశం మీద వెబినార్”. – పాల్గొన్న విజయ్ దేవరకొండ,ఐటీ సెక్రెటరీ ప్రిన్సిపల్ జయేష్ రంజన్

0
487

నేటి తరం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకకపోతే వారిలో సమాజం పట్ల వ్యతిరేక భావన కలిగే అవకాశాలున్నాయని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు. అలాంటి ప్రవర్తన యువతలో రానివ్వకుండా ఉండాలంటే ప్రభుత్వాలు యువతకు ఉపాధిని సృష్టించుకునేలా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ది వ్యూచర్ ఆఫ్ స్కిల్లింగ్ పేరుతో ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు టీసీఎస్ ప్రాంతీయ కార్యాలయ హెచ్ ఆర్ హెడ్ శ్రీకాంత్, డబ్యూడీసీ ఇండియా హెచ్ఆర్ హెడ్ డాక్టర్ కిరణ్మయి, టెక్ మహేందర్ హెచ్ఆర్ ఉపాధ్యక్షుడు వినయ్ అగర్వాల్,దేవరకొండ ఫౌండేషన్ సీఈఓ రాజ్ జనగాం పాల్గొన్నారు. ఈ వెబ్ నార్ లో యువత నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై గంటకుపైగా చర్చించారు.

ఈ చర్చలో పాల్గొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…”మన జీవితాలను నిలబెట్టుకొనే శక్తి మన చేతుల్లోనే ఉందని సూచించారు. ఏ వృత్తిలో రాణించాలనుకుంటే ఆ వృత్తిపై మమకారం పెంచుకొని పట్టుదలతో కృషి చేయాలని కోరారు. తన ఫౌండేషన్, నిర్మాణ సంస్థతోపాటు రౌడీ వేర్ లో సుమారు 50 మందికిపైగా ఉపాధిని కల్పించినట్లు పేర్కొన్న విజయ్… విద్య, ఉపాధితోపాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తాను పనిచేయబోతున్నట్లు”
స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here