తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఫ్రెండ్షిప్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, సింగిల్ సూపర్ స్టార్ రజినీ ఆంథెమ్ దేశ వ్యాప్తంగా రెస్పాన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా జులై30 ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా గ్లింప్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ను వెర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి తెలుగు, హిందీ, తమిళ భాషలలో విడుదల చేశారు. ఒక నిమిషం నిడివిగల ఈ గ్లింప్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వీడియోకు అన్ని భాషలలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
తమిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో యాక్షన్ కింగ్ అర్జున్, సతీష్ నటిస్తున్నారు. జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషలలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్మురుగన్, రాబిన్,
ప్రొడ్యూసర్స్: జెపిఆర్ & స్టాలిన్,
దర్శకత్వం: జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య.
Thank you brother.. hope u are doing well 🤗🤗 see you soon https://t.co/eszV0jFAqh
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 30, 2020
Awesome brother!! Beat wishes to you and you’re entire team 👍🔥💥big fan of Arjun sir!! https://t.co/u06zi7vxVi
— Rana Daggubati (@RanaDaggubati) July 30, 2020



