గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఉప్పెన సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్న “తమిళ్ మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి

0
390
Tamil Actor Vijay Sethupathi

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఉప్పెన సినిమా లో ప్రముఖ పాత్రలో నటిస్తున్న “తమిళ్ మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి.

ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వాతావరణ కాలుష్యం తగ్గడం కోసం మొక్కలు నాటి ఇస్తున్నారని అందులో భాగంగా నేను కూడా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉప్పెన సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా అభిమానులు అందరికి కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here