రాజకీయ జీవితంలో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మళ్ళి ప్రస్తుతం తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీ ద్వారా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇకపోతే అటు రాజకీయాలతో పాటు, ఇటు సినిమా రంగంలో కూడా బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్, 2014 ఆగష్టు లో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఖాతాను తెరిచారు.
ఇక అప్పటి నుండి ఎప్పటికప్పుడు తనకు సంబందించిన పలు విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్న పవన్, నేటితో 4 మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకున్నారు. తమ హీరో నేడు ఈ ఫీట్ సాధించడంతో పలువురు పవన్ ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. కాగా వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఒక పెరియాడికల్ మూవీ చేస్తున్న పవర్ స్టార్, దాని అనంతరం దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, జనసేన సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ దేశ సేవ చేసేందుకు ఆవిర్భవించిన పార్టీ. ఆ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు మార్పు కోరుకునే 4 మిలియన్ సైనికులకు కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
My heartfelt 🙏 gratitude to 4 million ‘Change Seekers.’ pic.twitter.com/XCzameXzWR
— Pawan Kalyan (@PawanKalyan) July 11, 2020



