తన 60వ బర్త్ డే కానుకగా నటరత్న ఎన్టీఆర్ గారి సూపర్ హిట్ సాంగ్ ని ఆలపించిన నటసింహం బాలకృష్ణ……!!

0
599
On the occasion of 60th Birthday Bala krishna Sang NTR Superhit song

నటసింహం నందమూరి బాలకృష్ణ రేపు తన 60వ జన్మదినాన్ని జరుపుకోనున్న విషయం తెలిసిందే. కాగా ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పెషల్ సరప్రైజ్ ఇంకొద్దిసేపటిలో రానుండగా, ఈలోపుగా అభిమానులకు మరొక సర్ప్రైజ్ ని అందించారు బాలకృష్ణ. 1961వ సంవత్సరంలో నటరత్న ఎన్టీఆర్ గారు హీరోగా, కెవి రెడ్డి గారు నిర్మాత, దర్శకులుగా రూపొందించిన సూపర్ హిట్ మూవీ ”జగదేకవీరుని కథ” సినిమాలోని ‘శివశంకరి శివానందలహరి’ అనే సాంగ్ ని బాలకృష్ణ స్వయంగా ఆలపించడం అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కాగా కాసేపటి క్రితం ఆ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది.

గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమాలోని ‘మామా ఏక్ పెగ లా’ అనే సాంగ్ ని ఆలపించి ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న బాలకృష్ణ, ప్రస్తుతం ఆలపించిన ఈ శివశంకరి సాంగ్ ని కూడా ఎంతో అద్భుతంగా ఆలపించడం జరిగింది. ఆరు నిమిషాలకు పైగా నిడివితో పాటు ఎంతో గొప్ప సంగీత, సాహిత్యాలతో రూపొందిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here