మూవీ మొగల్ డా. డి రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. డి రామానాయుడు 85వ జయంతి కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, రామానాయుడు మనవడు అభిరామ్ దగ్గుబాటి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ జె. బాలరాజు తదితరులు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ… ఈ రోజు రామానాయుడు గారి 85వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించాము. రామానాయుడు గారు లేకుంటే హైదరాబాదులో సినిమా పరిశ్రమ, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు.. ఫిలిం నగర్ లో విగ్రహంతో పాటు ,రామానాయుడు గారి పేరుతో ఎది మొదలు పెట్టినా సక్సెస్. ఫిలింనగర్ కు చెన్నారెడ్డి, దాసరి, రామానాయుడు గారు దేవుళ్ళు లాంటి వారు“ అన్నారు.
నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ .. ప్రొడ్యూసర్‌లందరికీ రామానాయుడు గారే హీరో, రోల్ మోడల్. దాసరి గారు ,రామానాయుడు గారు నన్ను ఎంతో ప్రొత్సహించిన వ్యక్తులు. నిర్మాతలగానే కాకుండా సినీ పరిశ్రమ, దానికి అనుంబంద కార్యాలయాలు అన్నీ అభివృద్ది కావటానికి రామానాయుడు గారే కారణం. ఏ సినిమా అయినా రామానాయుడు గారిని తలుచుకుని స్టార్ట్ చేస్తాము. ఆయన జయంతి ని ఎప్పుడు గొప్పగా జరుపుకుంటాం. రామానాయుడు గారి వారసుడిగా అభిరామ్ ఆయన ప్లేస్ ను బర్తీ చెస్తాడు“ అన్నారు.
అనంతరం రామానాయుడు గారి మనవడు అభిరామ్ మాట్లాడుతూ.. తాత గారు ఫిజికల్ లేకున్నా,మెంటల్ గా నాకు సపోర్ట్ గానే ఉంటారు` అన్నారు.
ఆ తర్వాత ప్రముఖ నిర్మాత కె.ఎస్‌రామారావు మాట్లాడుతూ .. నిర్మాతగా నాకు రామానాయుడు గారే స్పూర్తి. వారి ఫాలోవర్ గా సినిమాలు చెశాను. మా బ్యానర్ లో మంచి సినిమాలు రావటానికి నాయుడు గారి ప్రొత్సాహం ఎంతో ఉంది `అన్నారు.



