సినీ పరిశ్రమ విషయంలో కేసిఆర్ గారు ప్రత్యేక శ్రద్ద పెట్టారు : తలసాని సాయి కిరణ్ యాదవ్

0
45
Cinematography Minister Talasani Srinivas Yadav And Sri Talasani Sai Kiran Yadav Pressmeet

ఇటీవ‌ల త‌ల‌సాని ట్రస్ట్‌ ఆద్వర్యంలో 14000వేల మంది సినీ, టీవి కార్మికులకు నిత్యావసరాలను అందించిన తలసాని సాయి కిరణ్ ఇక ముందు కూడా ఇలానే కార్మికులను ఆదుకుంటామన్నారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాదు ఫిలిం చాంబర్ లో ఏర్పాటు ఈ కార్యక్రమంలో సి‌.కల్యాణ్, అభిషేక్ నామా పాల్గొన్నారు

ప్ర‌ముఖ నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ.. ‌తలసాని గారితో 30ఏళ్ల అనుబంధం నాది.. రాజకీయంగా తలసాని గారు ఎంతో ఎత్తు ఎదిగిన మా రిలేషన్ మాత్రం అలానే ఉంది. ఇటీవ‌ల‌ సినీ కార్మికులకు అండంగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు. సినీ పరిశ్రమకు అండంగా తలసాని గారిలా మరెవరు లేరు. సిఎం కేసిఆర్ కూడా మా పరిస్థితుల‌ను అర్దం చెసుకున్నారు. అతి త్వరలోనే చిత్రీకరణలకు అనుకూలంగా ఉండేలా జీవోను ఇవ్వనున్నారు“ అన్నారు.

నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ – తలసాని శ్రీనివాస్ గారు మా నిర్మాతలకు ఎంతో అండంగా ఉన్నారు తలసాని సాయి గారు తమ ట్రస్ట్ ద్వారా కార్మికులను ఆదుకున్నారు వారిద్దరికి ఈ సంద‌ర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా` అన్నారు.

తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణా ను సాధించటం తో పాటు, రాష్టాన్ని అభివృద్ధి పథంలో కేసిఆర్ గారు ముందుండి నడిపిస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ విషయంలో కూడా కేసిఆర్ గారు ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తలసాని శ్రీనివాస్ గారికి సినిమాలంటే ప్రేమ. ప్రతి సినిమాను తొలిరోజు చూస్తారు. సంబందిత నిర్మాత‌ల‌కు ఫోన్ చేసి అభినందిస్తారు. అలాగే చిరంజీవి గారు, నాగార్జున గారు ఇలా మిగతా అసోషియేషన్స్ అంతా కలిసి లీడ్ తీసుకుని సి.సి.సి ని ఏర్పాటు చేసి సినీ కార్మికులకు అండంగా ఉన్నారు. భ‌విష్య‌త్తులో కూడా అవ‌స‌ర‌మైతే సి.సి.సి తో పాటు మా త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా కూడా సినీ కార్మికులను ఆదుకుంటాం. తెలుగు సినిమాకు సంభందించి ఏ స‌మ‌స్య‌నైనా ప్రభుత్వం దృష్టికి త‌ప్ప‌కుండా తీసుకెళ్తాం“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here