లాస్ట్ పెగ్ చిత్రంలోని పోరి కిక్కా…బాటిల్ కిక్కా లిరికల్ వీడియో విడుదల.

0
549
Pori Kikka Bottle Kikka LyricalVideo song from Last Peg Movie Released

భారత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా వినూత్న కాన్సెప్టుతో వస్తోన్న లాస్ట్ పెగ్ . ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ కు అలాగే యాక్షన్ టీజర్ కు మంచి స్పందన లభించింది. లేటెస్ట్ గా లాస్ట్ పెగ్ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో పోరి కిక్కా.. బాటిల్ కిక్కా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సాంగ్ ను పాపులర్ సింగర్ హేమచంద్ర పాడడం జరిగింది, అలాగే ఎన్నో సూపర్ హిట్ పాటలు రాసిన భాష్యశ్రీ ..ఈ పాటను రచించారు. భాష్యశ్రీ విజయ్ అంథోని నటించిన సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ కు సాహిత్యం అందించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సంజయ్ మాట్లాడుతూ…
ఇటీవల యాక్షన్ టీజర్ ను విడుదల చేశాము, తాజాగా పోరి కిక్కా బాటిల్ కిక్కా లిరికల్ వీడియో విడుదల చేశాము త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటైల్స్ ను విడుదల చేయబోతున్నాము, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని తెలిపారు.

నటీనటులు: భారత్ సాగర్, యశస్విని రవీంద్ర
టైటిల్: లాస్ట్ పెగ్
బ్యానర్: భవసపందన ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ & బిఎండబ్ల్యు
రచన, దర్శకత్వం: సంజయ్ వడత్. ఎస్
నిర్మాత: రజత్ దుగోజి సలేంకి
సంగీతం: లోకేష్
మ్యూజిక్ ప్రొడ్యూసర్: సంజీవ్.టి
డిఓపి: కార్తిక్ కుమార్ కొణిదెల
ఎడిటర్: రుత్విక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here