ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

0
622
Megastar Chiranjeevi thanks to AP CM YS. Jagan

లాక్ డౌన్ సడలింపు ల నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా షూటింగులు, ఇతర విషయాల మీద చర్యలు ప్రారంభించింది. ఈ విషయమై ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు కలవగా ఆయన సానుకూలంగా స్పందించారు. నేడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తో ఫోన్ లో మాట్లాడానని ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు.

మెగాస్టార్ ట్వీట్,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరుపున వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియచేసాను. Lockdown ముగిసిన తరువాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని చెప్పారు. అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో త్వరలోనే వారిని కలవటం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here