కరోనా వ్యాధి ప్రబలకుండా మన దేశంతో పాటు దాదాపుగా చాలా దేశాల్లో కొన్నివారాలుగా లాక్ డౌన్ అమలవుతుండడంతో ఎక్కడి ప్రజలు అక్కడే తమ ఇళ్లలో ఉండిపోయారు. దానితో కొందరు క్రికెటర్స్, సినిమా ప్రముఖులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు రకాల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులతో సరదాగా పంచుకుంటున్నారు. ఇక ఇటీవల ‘అలవైకుంఠపురములో‘ సినిమాలోని ‘బుట్ట బొమ్మ’ సాంగ్ కు తన భార్యతో కలిసి డాన్స్ అదరగొట్టిన ఆస్ట్రేలియాన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్,
నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ‘పోకిరి’ సినిమాలోని ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే డైలాగ్ ని టిక్ టాక్ వీడియో చేసి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. నేను పోస్ట్ చేసిన వీడియో చూసి, ఇది ఏ సినిమాలోదో గెస్ చేయండి అంటూ ఆస్ట్రేలియాన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన పోస్ట్ లో తెలిపారు. కాగా వార్నర్ పోస్ట్ చేసిన పండుగాడు డైలాగ్ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది…..!!!