దర్శక దిగ్గజం రాజమౌళి నిర్మిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ హిస్టారికల్ మూవీ ‘ఆఆర్ఆర్’. ‘రౌద్రం రణం రుధిరం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో సీత పాత్రకు గాను బాలీవుడ్ నటి అలియా భట్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ట్రైయాంగిల్ ప్రేమకథ కానప్పటికీ తారక్, చరణ్ ఇద్దరు హీరోలతో కలిసి ట్రావెల్ చేస్తూ, ఎంతో అమాయకంగా, లాఘవంతో ఎవరికీ ఎటువంటి హానిచేయని మనస్తత్వం గల అమ్మాయి పాత్రకు అలియా అయితేనే కరెక్ట్ అని భావించి చివరకు ఆమెను ఎంపిక చేసినట్లు రాజమౌళి తెలిపారు. కాగా ఈ విషయాన్ని కాసేపటి క్రితం ఈ సినిమా నిర్మాతలైన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది…..!!!