రామ్ చరణ్ పై ఫన్నీగా పంచ్ వేసిన చిరంజీవి…..!!

0
867
Megastar Chiranjeevi Funny Punch on Ramcharan

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా కొన్నాళ్లుగా తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. నిన్న ఆయన తనయుడు రామ్ చరణ్, తన అమ్మ సురేఖ, నానమ్మ అంజనమ్మల వద్ద సరదాగా వెన్న తీయడం నేర్చుకుంటున్న వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. కాగా నేడు అదే వీడియోని ట్యాగ్ చేసిన చిరంజీవి,

మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. నువ్వెంత వెన్న రాసినా నీకు బెటర్ పొజిషన్ మాత్రం రాదు. కానీ, అదే గ్యారంటే నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో, అంటూ ఫన్నీగా పంచ్ వేస్తూ కాసేపటిక్రితం రీట్వీట్ చేయడం జరిగింది. మెగాస్టార్ పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here