యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన ‘సరిలేరు నీకెవ్వరు’ – ‘హీ ఈజ్ సో క్యూట్’ సాంగ్……!!

0
912
Sarileru Neekevvaru reached 100 Million youtube Views

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ల కాంబో లో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు‘. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోపాటు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ఇందులోని సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

ఇకపోతే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లామర్ ని పొగుడుతూ హీరోయిన్ రష్మిక ఆలపించే ‘హీ ఈజ్ సో క్యూట్’ సాంగ్ లిరికల్ వీడియోకి నేటితో యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ని అందుకుంది. దీనితో అమితనందాన్ని వ్యక్తం చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్, సినిమా యూనిట్ కి, ప్రత్యేకంగా సంగీత దర్శకుడు దేవికి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here