ప్రస్తుతం దేశం మొత్తం కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లు అన్నీ బంద్ కావడంతో కావడంతో నటీనటులందరూ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక టాలీవుడ్ నటులు మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్నాళ్లుగా తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా నేడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఒక రకంగా ఈ కరోనా వలన అందరూ తమ తమ కుటుంబాలకు మరింత దగ్గరయ్యారని, మనం ప్రకృతి వనరులను సక్రమంగా వాడుకోకుండా వాటిని విచ్చిన్నం చేస్తున్నందున, ఇది ఒకరకంగా మన మానవాళికి హెచ్చరిక అని చెప్పిన మెగాస్టార్, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా చాలా బాగా వస్తోందని, సినిమాలోని కథ, కథనాలు రేపు థియేటర్ కి వచ్చి చూసే ప్రేక్షకుడికి చక్కటి అనుభూతిని, భావోద్వేగాలను అందించడం ఖాయమని మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ లో అన్నారు. లాక్ డౌన్ పూర్తి అయిన అనంతరం వేగవంతంగా షూటింగ్ పూర్తి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని మెగాస్టార్ అన్నారు……!!