స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ AA20 బిగ్ అప్డేట్

0
321
Allu Arjun AA20 Update

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో ఆయన ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ సినిమాని నిర్మిస్తోంది.

ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో ఆరోజున ఉదయం 9 గంటలకు సినిమా కీలక అప్డేట్ రెవీల్ చేయనున్నట్టు నిర్మాతలు కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసారు. ‘ఏమబ్బా అందరూ బాగుండారా, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాండే అప్డేట్, ఏప్రిల్ 8న, ఉదయం 9 గంటలకు వాస్తాండాది, రెడీ కాండబ్బా’ అంటూ ఒక డైలాగ్ పోస్ట్ ని పెట్టారు. దీనిని బట్టి బన్నీ ఈ సినిమాలో ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఆనందం మిన్నంటింది. మరి బన్నీ పుట్టినరోజున ఎటువంటి పోస్టర్ ని మైత్రి సంస్థ రిలీజ్ చేస్తుందో చూడాలి…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here