సుకుమార్ ప్రియ మిత్రుడు మరణం

0
867
Sukumar Friend died

తనకి అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ కోల్పోయారు. ఈ షాకింగ్ న్యూస్ విన్న సుకుమార్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌.. సుకుమార్ స్నేహితుడు, మేనేజరే కాకుండా ‘అమరం అఖిలం ప్రేమ’ అనే చిత్రానికి నిర్మాత కూడా. సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ఈ వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ ఒకరు. శనివారం మథ్యాహ్నం ఆయన తీవ్ర గుండె పోటుతో మరణించారు. ఎప్పుడు డిజప్పాయింట్‌కి లోనైనా.. తన మిత్రుడు వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌తో మాట్లాడితే మళ్లీ ఎనర్జీ వచ్చేదని, అంతగా తన లైఫ్‌లో వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ పాత్ర పోషించారని సుకుమార్ తెలియజేశారు. ఆయన మరణం తనకి ఎంతో లోటని, తనకి సంబంధించి ఎవ్వరూ తన ప్లేస్‌ని రీప్లేస్ చేయలేరని తెలుపుతూ.. వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సుకుమార్ తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here