ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘రెడ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్….!!

0
878
Ram Red Movie

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్సకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’. తొలిసారిగా రామ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని ఇటీవల తమిళ్ లో అరుణ్ విజయ్ హీరోగా తెరక్కిన ‘తడం’ మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

థ్రిల్లింగ్, సస్పెన్స్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు సంగీత దర్శకులు మణిశర్మ స్వరపరిచిన ‘నువ్వే నువ్వే’ అనే పల్లవితో సాగె ఒక సాంగ్ కూడా ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతల నుండి విశేషమైన స్పందనను రాబట్టడం జరిగింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని కాసేపటి క్రితం యూనిట్ సభ్యులు అఫీషియల్ గా ప్రకటించారు. సమ్మర్ కానుకగా తమ సినిమాని ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ ని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. గతంలో రామ్, కిశోర్ తిరుమల కలయికలో వచ్చిన నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలు మంచి సక్సెస్ లు అందుకోవడంతో, ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ రెడ్ మూవీ పై ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here