“లవ్ స్టొరీ” ఫస్ట్ సింగల్ “ఏయ్ పిల్లా” కు సూపర్బ్ రెస్పాన్స్.

0
270
Love story movie

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’.సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న లవ్ స్టోరీ నుండి ఇటీవల విడుదలైన 1 మినిట్ మ్యూజికల్ ప్రివ్యూ ‘‘ఏయ్ పిల్లా’’ అనే సాంగ్ ప్రివ్యూ కు మంచి ఆదరణ లభించింది. అలాగే మంగళవారం రిలీజైన “ఏయ్ పిల్లా” ఫుల్ లిరికర్ వీడియోకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. “ఎన్నో తలపులు ఏవో కలతలు బ్రతుకే పోరవుతున్న… గాల్లో పతంగిమల్లే ఎగిరే కలలే నావి”.. వంటి లిరిక్స్ బాగున్నాయి. చైతన్య పింగళి ఈ సాంగ్ కు అద్భుతమైన సాహిత్యం అందించారు. పవన్ సి. హెచ్ అందించిన సంగీతం ఇంస్టెంట్ హిట్ గా నిలిచింది.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న లవ్ స్టొరీ మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. “ఫిదా” తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
ఆర్ట్: రాజీవన్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here