` `ఓ పిట్ట కథ` చిత్రాన్ని ప్రమోట్ చేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ – న‌టుడు బ్రహ్మాజి.

0
3875
Brahmaji Interview

హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీకి సినిమా పరిశ్రమతో అనుబంధం, సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన బ్రహ్మాజీ ప్రస్తుతం ఓ పిట్ట కథ సినిమాతో తన కుమారుడు సంజయ్ రావును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తెరకెక్కించింది. ఈ సినిమా మార్చి 6న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బ్రహ్మాజీ మీడియాతో ముచ్చటించారు

సినిమా గురించి?
– నా కుమారుడు సంజయ్ రావు ఓ పిట్ట కథ సినిమాతో టాలీవుడ్‌ పరిచయం అవుతున్నారు. అందుకోసం నాకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలను పూర్తిగా ఉపయోగించుకొన్నాను. నాతో ఉన్న అనుబంధంతో నేను అడ‌గ‌గానే చిరంజీవి, మహేష్ బాబు, కొరటాల శివ తదితరులు నాకు పూర్తిగా సహకారం అందించారు. నా కుమారుడు నటించిన సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్.

చాలా కాలం తర్వాత మీ అబ్బాయిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు రీజ‌న్ ఏంటి?
– చాలా మంది ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు వారి కొడుకుల్నిపెద్ద పెద్ద ప‌ద‌వుల్లో చూడాల‌నుకోవ‌డంలేదా? అది వారి వృత్తి. నటన నా వృత్తి . చాలా కాలంగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నా కుమారుడిని యాక్టింగ్‌లోకి ప్రవేశపెడితే తప్పేమిటి. టాలీవుడ్‌లో నేను హీరోను కాదు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్టును. కాబట్టి నా కొడుకును ఓ మంచి క్యారెక్టర్‌తో సినిమా రంగ ప్రవేశం చేయాలని భావించాను. ఓ మంచి క్యారెక్టర్‌తో ఎస్టాబ్లిష్ అయితే ప్రేక్షకులకు చేరువ అవుతారనేది నా గట్టి ఫీలింగ్. ప్రధానంగా నా కుమారుడు సంజయ్ రావు మర్చంట్ నేవిలో పనిచేసే వాడు. ఓ రోజు యాక్టింగ్‌ చేస్తానని చెప్పాడు. సరే ట్రై చేయి.. సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ఉంటావు. లేకపోతే వెళ్ళి మ‌ళ్ళీ ఉద్యోగం చేసుకో అని స‌లహా ఇచ్చాను. అలా ఈ సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

దర్శకుడు చెందు గురించి?
దర్శకుడు చెందు ముద్దును నాకు డైరెక్టర్ సాగర చంద్ర పరిచయం చేశాడు. అప్పుడు సంజయ్ కోసం ఓ షార్ట్ ఫిలిం చేయాలని చెందు ముద్దును కలిశాను. కొన్ని రోజుల తర్వాత ఓ పాయింట్‌తో వచ్చి నాకు చెప్పాడు. నాకు నచ్చడంతో ఓ పిట్ట కథ సినిమాగా మారింది. ఈ కథలో అమలాపురంలోని ఉండే ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ పాత్ర నాది. సీరియస్‌గాను.. వినోదం కూడిన పాత్ర.

సంజయ్ కి నటన విషయంలో మీరేమైనా సలహాలు ఇచ్చారా?
– లేదండీ! సంజయ్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీతో నా కుమారుడి గురించి చెప్పాను. అప్పుడే నక్షత్రం సినిమా ప్రారంభం కాబోతున్నది. స్వయంగా కృష్ణవంశీ మా ఇంటికి వచ్చి సంజయ్‌ని తీసుకొని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెట్టుకొన్నారు. దాంతో సినిమా వాతావరణం బాగా అలవాటు పడిపోయాడు. సినిమా రంగంలో అన్ని శాఖల గురించి బాగా తెలిసింది. దాంతో హీరోగా పరిచమయ్యే క్రమంలో సెట్లో బెరుకు పోయింది. డెబ్యూ మూవీ కాబట్టి బాగానే చేశాడు అనిపించింది

ఈ సినిమా గురించి బాగా నమ్మకంగా ఉన్నట్టు ఉన్నారు ?
– ఈ సినిమాలో మంచి స్క్రీన్ ప్లే ఉంది. రెగ్యూలర్ లా అనిపించదు. చాలా ఇంట్రస్టింగ్ ప్లే ఉంది. తెలుగులో ఇంతవరకు ఇలాంటి స్క్రీన్ ప్లే రాలేదు. సినిమాలో చాలా యాంగిల్స్ లో స్క్రీన్ ప్లే నడుస్తోంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.

ఇండస్ట్రీలో ఈ సినిమాని ఇప్పటివరకూ ఎవరెవరు చూశారు. వాళ్ళ ఎలా రియాక్ట్ అయ్యారు ?
– నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ చూశారండి. కృషవంశీ, అనిల్ రావిపూడి, మేర్లపాక గాంధీ, హనురాఘవ్ పూడి ఇలా కొంతమంది చూశారు. వాళ్ళందరికీ సినిమా బాగా నచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here