ఈ సినిమాలో ప్రతి పాత్రకు `ఒక పిట్టకథ` ఉంటుంది – విశ్వంత్‌ దుద్దంపూడి

0
1195

కేరింత సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌య్యి `మ‌న‌మంతా`, క్రేజి క్రేజి ఫీలింగ్‌, తోలుబొమ్మ‌లాట వంటి చిత్రాలతో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విశ్వంత్‌ దుద్దంపూడి. తాజాగా విశ్వంత్‌, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై చెందు ముద్దు ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌ముఖ నిర్మాత వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు. ఈ నెల 6న చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశ్వంత్‌ దుద్దంపూడి ఇంట‌ర్వ్యూ.

ఈ సినిమా ఎలా మొదలైంది ?
– దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారి నాకు ఈ సినిమా లైన్ గురించి చెప్పారు. ఆ త‌ర్వాత‌ చెందు ముద్దు అనే వ్యక్తి మంచి కథ చెప్పారు. నువ్వు చేస్తే చాలా బాగుంటుంది ..చేస్తావా అని చంద్రశేఖర్ అడిగారు. యేలేటిగారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆయన చెప్పారని కథ కూడా వినకుండా ఈ సినిమా చెయ్యడనికి ఒపుకున్నాము.

చంద్రశేఖర్ యేలేటితో మీకు ఉన్న అనుబంధం గురించి ?
– నేను ఆయన డైరెక్షన్ లో ‘మనమంతా’ సినిమా చేశాను. ఆయన అంటే నాకు చాలా గౌరవం. నాకు సరైన కథలు రావడంలేదు, ఒక పర్ఫెక్ట్ సినిమా చెయ్యాలి.. మీతో ట్రావెల్ అవుతానని చెప్పి ఆయనతో ట్రావెల్ అయ్యాను. ఇక స్క్రీన్ ప్లేలో ఆయనకున్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. ఆలాంటి ఆయనకు ఈ సినిమా స్క్రీన్ ప్లే బాగా నచ్చింది.. అందుకే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని పూర్తి నమ్మకం ఉంది.

ఈ సినిమాకి ‘ఓ పిట్టకథ’ అని సింపుల్ టైటిల్ పెట్టారు ?
– ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లే గేమ్. నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇలాంటి స్క్రీన్ ప్లే రాలేదు. విలేజ్ నేపథ్యంలో చేసాము కాబట్టి సింపుల్ గా అనిపిస్తోంది. టైటిల్ అలా పెట్టడానికి కూడా స్క్రీన్ ప్లేనే కారణం. సినిమాలో చాలా యాంగిల్స్ లో స్క్రీన్ ప్లే నడుస్తోంది. ప్రతి పాత్రకు ఒక పిట్టకథ ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాము. కచ్చితంగా ఈ సినిమా కొత్తగా అనిపిస్తోంది.

ఈ సినిమాలో మీరు థ్రిల్ అయిన పాయింట్ ఏమిటి ?
– సినిమాలో థ్రిల్ అయిన పాయింట్ ఇప్పుడు నేను చెప్పే కంటే.. సినిమా చూశాక ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను మీరు ఫీల్ అయితే బాగుంటుంది. అయితే నా క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నేను ఇలాంటి క్యారెక్టర్ లో ఇంతవరకు చెయ్యలేదు.

ఇండస్ట్రీలో మీ జర్నీ గురించి ?
– ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలే.. మంచి సినిమాలు చేస్తాడు అనే మంచి పేరును నాకు తీసుకువచ్చాయి. అయితే కమర్షియల్ గా అవి పెద్దగా వర్కౌట్ అవకపోయినా గుడ్ ఫిల్మ్స్ చేశాను అనే సంతృప్తి నాకు ఉంది. నా కెరీర్ లో ‘మనమంతా’ లాంటి మంచి సినిమా ఉన్నందుకు గౌరవంగా చెప్పుకుంటా.

సినిమా కమర్షియల్ గా హిట్ అయితేనే కదా.. ఆ సినిమా నిజమైన హిట్ అనిపించుకుంటుంది ?
– అవును, కమర్షియల్ గా వర్కౌట్ అవ్వాలి. అయితే అన్ని సినిమాలు అలా అవ్వవు. బట్, నేను కూడా మంచి కమర్షియల్ హిట్ కోసం చూస్తున్నాను. రీసెంట్ గా ‘కాదల్’ అని ఒక సినిమా చేశాను. అది నాకు కమర్షియల్ హిట్ ఇస్తోందని అనుకుంటున్నాను.

తదుపరి సినిమాలు ?
– ‘కాదల్’ మూవీ రాబోతుంది. అలాగే ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే మరో సినిమా కూడా ప్రస్తుతం షూట్ లో ఉంది. ఈ సినిమా ఎమోషనల్ గా సాగుతూనే కమర్షియల్ యాంగిల్ లోనే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here