పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ ‘వకీల్‌సాబ్’ ఫస్ట్‌లుక్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్..

0
739

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. తమ అభిమాన కథానాయకుడు వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆశపడిన వాళ్లకు ఫస్ట్‌గిఫ్ట్‌ అందింది. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ పాత్రలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం ఈ చిత్రానికి సంబంధించి పవన్‌ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించారు.

ఈ సినిమాకు ‘వకీల్‌సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
చేతిలో పుస్తకం, కళ్లజోడు పెట్టుకుని పడుకొని ఉన్న పవన్‌లుక్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వేసవి కానుకగా మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత‌లు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు, సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ స‌మ‌క్షంలో దిల్‌రాజు కార్యాల‌యం ముంద‌ట ప‌వ‌న్ అభిమానులు కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు సంబ‌రాలు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here