యంగ్ హీరో నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా భీష్మ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సంపాదించడం జరిగింది. ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల తో పాటు పలువురు సినిమా ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక నేడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా భీష్మ టీమ్ కు అభినందనలు తెలియచేసారు. మంచి ఎమోషనల్ గా పలు కమర్షియల్ హంగులతో భీష్మ సినిమాని తీసిన దర్శకుడు వెంకీ కుడుములకు, ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ కనబరిచిన హీరోయిన్ రష్మిక కు, అలానే ఓవైపు పెళ్లి ఫిక్స్ అయి, మరోవైపు ఈ సినిమా విజయంతో డబుల్ జోష్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో నితిన్ కు, అలానే నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అల్లు అర్జున్. ఇక ఈ సినిమాని అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్స్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి….!!!