తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’. తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వపడే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. తాజాగా ఆర్కా మీడియా వర్క్స్, మహాయాణ మోషన్ పిక్చర్స్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతలుగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ . మళయాళ హీరో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన ‘మహేశింతే ప్రతీకారమ్’ చిత్రానికి రీమేక్ ఇది. కెరీర్ మొదటి నుండి విభిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన వీడియోలు, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
తాజాగా చిత్ర టీజర్‌ని ఆల్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. ప్రతీకారం నేపథ్యంలో చిత్ర కథ నడుస్తుందని అర్ధమవుతుంది. ఉమామహేశ్వరరావు అనే ఫొటోగ్రాఫర్ గా సహజసిద్దమైన సత్యదేవ్ నటన ఈ సినిమాకి కీలకం కానుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ఏయ్ మహేషూ కొట్టరాన్నిఅని నరేష్ చెప్పడంతో సత్యదేవ్ వెళ్ళి కొట్టే సన్నివేశం సినిమాపై అంచనాలను పెంచింది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 17 ఏప్రిల్ న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సత్యదేవ్ కంచరన, నరేష్, సుహాస్, జబర్‌దస్త్ రాంప్రసాద్, కరుణాకరణ్, టి.ఎన్.ఆర్, రవీంద్ర విజయ్, కె.రాఘవన్ తదితయి నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: అప్పు ప్రభాకర్, సంగీతం: బిజ్‌బల్, నిర్మాతు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా వర్క్స్), విజయ ప్రవీణ పరుచూరి(మహాయాణ మోషన్ పిక్చర్స్), దర్శకత్వం: వెంకటేశ్ మహ.