యూత్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఏ వల్లభ నిర్మాతగా ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరిచిన సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే కాసేపటి క్రితం వరల్డ్ ఫేమస్ లవర్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
‘ఈ ప్రపంచంలో నిస్వార్ధమైది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటి, దానిలోని రెండు అక్షరాలు ఒక పెద్ద సునామీని రేపగలవు’ అంటూ హీరో విజయ్ పలికే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ప్రారంభం అయ్యే ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆకట్టుకునేలా గా పలు రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలతో సాగింది. ‘ఐ వాంటెడ్ టూ బి ది వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ హీరో చెప్పే డైలాగ్ ని బట్టి సినిమాలో అతడి పాత్ర యొక్క ఔచిత్యం మనకు అర్ధం అవుతుంది. ‘ఆ గౌతమ్ వేరు, ఈ గౌతమ్ వేరు’ అని రాశి ఖన్నా అనగానే,
‘నా ముక్కు మూతి తోలు ఏమైనా మారిపోయిందా’ అంటూ ఎమోషనల్ గా విజయ్ చెప్పే డైలాగ్ హృదయానికి తాకుతుంది. ‘నా గుండెకి తగిలిన దెబ్బకి పెయిన్ తెలియకుండా ఉండాలంటే, ఫిజికల్ గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి’ అంటూ ట్రైలర్ చివర్లో విజయ్ చెప్పే డైలాగ్ ఆలోచింపచేస్తుంది. మొత్తంగా ఆకట్టుకునే విజువల్స్, యాక్షన్, రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్ తో, అలానే అలరించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సాగిన వరల్డ్ ఫేమస్ లవర్ థియేట్రికల్ ట్రైలర్, సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఈనెల ప్రేమికుల దినోత్సవం కానుకగా 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు….!!


