ఏస్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్ టీ ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా డి వి వి దానయ్య నిర్మిస్తున్న మాగ్నమ్ ఓపస్ ఆర్ ఆర్ ఆర్ జనవరి 8, 2021న విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంబంధించి నైజాం ప్రదర్శన హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.