‘క్రాక్’ లో రక్షకుడిగా మాస్ మహారాజా రవితేజ….!!

0
463

మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్, యాక్షన్ కాప్ డ్రామా మూవీ క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా నుండి నేడు ఒక లేటెస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

సముద్రం ఒడ్డున ఉన్న ఒక ప్రాంతం కనపడేలా ఎంతో ఎత్తు నుండి మాస్ మహారాజ రవితేజ, రక్షకుడిగా నిలబడి చూస్తూ ఉన్న ఈ పోస్టర్ ని బట్టి చూస్తుంటే సినిమాలో మాస్ అంశాలతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉండనున్నట్లు అర్ధం అవుతోంది. గతంలో రవితేజ, గోపీచంద్ ల కాంబినేషన్ లో వచ్చిన డాన్ శ్రీను, బలుపు సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాపై మాస్ రాజా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు ఉన్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 8 న రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here