యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘అశ్వథ్థామ`. మెహరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటీవ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత ఉషా ముల్పూరి ఇంటర్వ్యూ.
ఆడియన్స్ నుండి ఎలాంటి స్పందన వస్తోంది?
– ‘అశ్వథ్థామ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. శౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. చిత్రం చాలాబాగుందని, ఇంకా మూడు నుంచి నాలుగు వారాలు థియేటర్స్‌లో బాగా ఆడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుండటం సంతోసాన్ని ఇస్తుంది. మనకు ఒక నిర్భయ కేసు తెలుసు, ఒక దిశ యాక్ట్ తెలుసు..ఇలా కూడా జరుగుతుందని మనలో చాలామందికి తెలియదు. కొత్తగా ఈ సినిమాలో చూపించాం. శౌర్య ఫ్రెండ్ వల్ల సిస్టర్ స్టోరీ. రియల్‌గా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సినిమాలో మరోలా చూపించాం. ఓ సోషల్‌కాజ్‌తో తీశాం. ఎమోషనల్‌గాకనెకై్ట తీశాం. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నాగశౌర్యలో మరో యాంగిల్ కూడా ఉందని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. ఇప్పటివరకు లవర్‌బాయ్‌లానే చూశాం. మాస్ యాగింల్ కూడా ఉందని బాగా రిసీవ్ చేసుకున్నారు. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తున్నారు.
ఈ సినిమాకి కథ రాసింది కూడా మీ అబ్బాయే కదా..కథ పరంగా శౌర్యకి ఎలాంటి అప్రిసియేషన్ వస్తోంది?
– కథ పరంగా శౌర్యాకు మంచి స్పందన వస్తోంది. ఒక నిర్మాతగా కంటే కూడా ఒక తల్లిగా బాగా సంతోషపడుతున్నాను. కథ చెప్పినప్పుడు తను కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీలయ్యాడు.‘నర్తనశాల తీసి చాలా మా తల్లిదండ్రులను బాధ పెట్టానని శౌర్య అన్నాడు. నేను బాధపడ్డాను. శౌర్య కెరీర్‌లోనే అది బిగ్గెస్ట్ డిజాస్టర్. మా బ్యానర్‌లో అలాంటి సినిమా ఇచ్చామని నేను బాధపడ్డాను. వాటిని తీసివేసి అశ్వధ్దామ మంచి సంతోషాన్ని ఇచ్చింది.
ఒక హీరోగా, స్టోరీ రైటర్ గా నాగశౌర్యకి ఎంత పారితోషికం ఇచ్చారు?
– రైటర్‌గా, హీరోగా శౌర్యకు పారితోషికం ఇవ్వలేదు. ఎఫ్2లో చెప్పినట్లు మిగిలిందంతా వాడికేగా (నవ్వుతూ).
శౌర్య హీరోగా, రైటర్ గా రాణిస్తున్నాడు కదా దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
– శౌర్య ఫస్ట్ హీరో అవుతాడనుకోలేదు. అయ్యాడు. రైటర్ అనుకోలేదు. అయ్యాడు. దర్శకుడు అవుతాడామో చూడాలి. రాఘవేంద్రరావుగారితో సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. రాఘవేంద్రరావుగారు, నందినిరెడ్డిగారు ఫోన్ చేసి అభినందించారు. త్వరలోనే వారిద్దరూ కలిసి శౌర్యని ఇంటర్వ్యూ చేస్తాం అని చెప్పారు.
ఒక నిర్మాతగా, తల్లిగా సినిమా చేస్తున్నప్పుడు ఏమైనా టెన్షన్ ఫీల్ అయ్యారా?
– సినిమా చేస్తున్నప్పుడు కూడా టెన్షన్ ఫీలయ్యాం. ప్రాణం పెట్టి తీశాం. కమర్షియల్ హీరోతో వెళ్లాలనుకునేవారికి చేయాలనుకునేవారికి శౌర్య కూడా ఒక మంచి ఆప్శన్ అని చాలా మంది చెబుతున్నారు. బయట కూడా మాసే. అతనికి క్యూట్ లవర్‌బాయ్ అంటుంటారు. ఆ ఇమేజ్ ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా శౌర్య మాసే. శౌర్యని రెబల్ అంటారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం అలా ముద్ర పడింది. మెదటినుండి కొంచెం పొగరు ఎక్కువే. తప్పు చేయకపోతే మాట పడేంత సాఫ్ట్ క్యారెక్టర్ కాదు. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరో అయ్యాడు. అందం ఉండి, ప్రతభ ఉన్నప్పటికి హీరోగా రాణించలేనివారు చాలామంది ఉంటారు. కానీ శౌర్యను ఒక హీరోగా యాక్సెప్ట్ చేశారు. అందుకు దేవుడికి రుణపడి ఉంటాం. పెద్ద హిట్స్ లేకపోయినా..18 సినిమాలు చేశాడు. ఆడియన్స్‌కు థ్యాంక్స్,.పెద్దహీరోల సినిమాలకు ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ శౌర్యకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆడియన్స్‌కు థ్యాంక్స్. ప్రేక్షకులకు నచ్చిందంటున్నారు. మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి షోస్ పెరిగాయి.
మీ బ్యానర్‌లో నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుంది?
– అందరి హీరోలతో చేయాలని ఉంది. మా అబ్బాయి ఒక్కరే హీరో అని నేను అనుకోవడం లేదు. మేం ఫ్యాషన్‌గా, డెడికేటేడ్‌గా చేద్దాం అనుకుంటున్నాం. కథ కుదరాలి. ఈ పరిశ్రమకి మేము అనుకోనికారణంగా వచ్చాం. డబ్బులు సంపాదించడం కోసం కాదు. తను ఒక కథ రాసుకుంటున్నాడు. అదే కథతో వెళ్దాం అనుకుంటున్నాం. ఇదే అని కాదు. వేరే కథ బాగా ఉంటే వేరే హీరోతో కూడా సినిమా నిర్మిస్తాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.