‘V’ లో రాక్షసుడిగా నాని …!!

0
852

నాచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు కలయికలో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ ‘వి’. ఒక ఆసక్తికరమైన పాయింట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని, రక్షకుడిగా ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా నుండి రక్షకుడిగా నటిస్తున్న సుధీర్ బాబు లుక్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, నేడు కాసేపటి క్రితం రాక్షడిగా నాని లుక్ ని రిలీజ్ చేసింది. మెలితిప్పిన మీసం, చేతిలో కత్తెర పట్టుకుని ఎంతో గంభీరంగా ఉన్న నాచురల్ స్టార్ నాని పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.

ఇటువంటి రాక్షసుడిని మీరు ఎక్కడా చూసి ఉండరు అంటూ ఈ సినిమా నిర్మాతలైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు ఈ పోస్టర్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. అదితి రావు హైదరీ, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు సైరా మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here