రవితేజ, శ్రుతి హాసన్, గోపీచంద్ మలినేని, ఠాగూర్ మధు కాంబినేషన్ మూవీ ‘క్రాక్’ మే 8న విడుదల

0
443

ఇదివరకు తమ కాంబినేషనులో రెండు బ్లాక్ బస్టర్లు అందించిన మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, మూడోసారి కలిసి పనిచేస్తోన్న సినిమా ‘క్రాక్’. దీంతో తమ కాంబినేషనులో హ్యాట్రిక్ కొట్టడానికి వారు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ‘క్రాక్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

రవితేజ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ‘క్రాక్’ సినిమా ని మే 8న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ పోస్టరును విడుదల చేశారు. ఈ పోస్టరులో రవితేజ ఖాకీ డ్రస్సులో వెహికిల్ నుంచి బయటకు వస్తూ, బదాస్ గా కనిపిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తోన్న ‘క్రాక్’లో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాల మేళవింపుతో, ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా తయారవుతోంది.

రెండు శక్తిమంతమైన పాత్రల్ని తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్ కుమార్ పోషిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘మెర్సాల్’, ‘బిజిల్’ వంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు ‘క్రాక్’ కు డీఓపీగా పనిచేస్తున్నారు.

తారాగణం:
రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్ కుమార్, దేవీప్రసాద్, చిరాగ్ జాని, మౌర్యని, ‘హ్యాపీ డేస్’ సుధాకర్, వంశీ చాగంటి.

సాంకేతిక బృందం:
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
మేకప్: శ్రీనివాస రాజు
కాస్టూమ్స్: శ్వేత, నీరజ కోన
సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి
నిర్మాత: బి. మధు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
బ్యానర్: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here