‘డిస్కోరాజా` సక్సెస్ సెలెబ్రేషన్స్!!

1
825

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా రామ్‌ తాళ్ళూరి ప్రొడక్షన్‌పై సాయి రిషిక సమర్పణలో ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో రజిని తాళ్లూరి నిర్మించిన సైన్స్‌ ఫిక్షన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ ‘డిస్కోరాజా`. న‌భా న‌టేష్‌, పాయ‌ల్ రాజ్‌పూత్‌, తాన్య‌హోప్ హీరోయిన్స్‌. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 24న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై పాజిటివ్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ‘డిస్కోరాజా` సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ‘డిస్కోరాజా` సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మాస్ మహారాజ రవితేజ, నిర్మాత రామ్ తాళ్ళూరి, దర్శకుడు వి. ఐ ఆనంద్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర.టి, డిస్ట్రిబ్యూటర్ ఆడెపు శ్రీనివాస్ పాల్గొని సక్సెస్ కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ – “ఈరోజు విడుదలైన మా ‘డిస్కోరాజా’ చిత్రానికి ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. మంచి ఓపెనింగ్స్ కూడా సాధించినందుకు హ్యాపీ గా ఉంది. రెండేళ్ల పాటు మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినందుకు సంతోషంగా ఉంది. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. యూనిట్‌ అందరి తరఫున ప్రేక్షకులకు ధన్యవాదాలు”అన్నారు.

దర్శకుడు వి. ఐ ఆనంద్ మాట్లాడుతా – ” యూఎస్‌ ప్రిమియర్స్‌ నుంచే మంచి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఇంటర్‌వెల్‌ అండ్‌ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. మార్నింగ్‌ నుంచి థియేటర్స్‌కు వెళ్తున్నాం. క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌వస్తున్నాయి. సినిమాలోని ట్విస్ట్‌లను ఎంజాయ్‌ చేస్తున్నారు. రవితేజగారు, ‘వెన్నెల’ కిశోర్‌ కాంబినేషన్స్‌లో వచ్చే హాస్య సన్నివేశాల గురించి ప్రేక్షకులు ఎక్కువ‌గా చెప్పుకుంటున్నారు. మేము చేసిన కొత్త ప్రయత్నాన్ని ప్రొత్సహించి ప్రేక్షకులు మాకు మంచి ఫలితం ఇచ్చారు. అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ కూడా బాగున్నాయి. మంచి మౌత్‌ టాక్‌ వినిపిస్తోంది. ఆడియ‌న్స్‌ ఫోన్‌కాల్స్ చేసి హైలైట్స్‌ గురించి మాట్లాడుతున్నారు. కామెడీ, ఎమోషన్స్‌, పాయల్‌-రవితేజల లవ్‌ ట్రాక్‌ బాగుందంటున్నారు. ‘డిస్కోరాజా’ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ వారి ఫ్యామిలీస్ తో కలిసి చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ ఆడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఇదొక కొత్త ప్రయత్నం. ఫస్టాప్‌ చూసినప్పుడు ఓ హాలీవుడ్‌ ఫిల్మ్‌ చూస్తున్నానా? అనే ఫీలింగ్‌ కలిగింది. కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా మరింత బాగా నచ్చతుంది. టెక్నీకల్‌గా కూడా కొత్తగా తీశారు. సినిమా చూసి ఎమోషనల్‌ అయ్యాను. మంచి నిర్మాణ విలువలతో నిర్మించారు రామ్‌తాళ్లూరి. ఇలాంటి కథను ప్రయత్నించాలంటే గట్స్‌ ఉండాలి. ఫీల్‌ గుడ్‌ సినిమా. బుకింగ్స్‌ బాగున్నాయి. ప్రేక్షకులు మాకు ఇచ్చిన రేటింగ్‌ 5కి 4.5 ఉంది.మీరు కూడా ఆన్‌లైన్లో చెక్‌ చేసుకోవచ్చు. కొత్త ప్రయత్నాలుగా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వెంటనే ప్రేక్షకకులు రిసీవ్‌ చేసుకుంటే హిట్‌ నుంచి సూపర్‌హిట్‌కు వెళుతుంది. ప్రేక్షకులు, మీడియా ఈ సినిమాను ప్రొత్సహిస్తారని ఆశిస్తున్నాను”అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here