నేటి నుండి RRR షూటింగ్ లో పాల్గొననున్న అజయ్ దేవగన్…..!!

0
799

అద్భుత దర్శకత్వ ప్రతిభతో బాహుబలి రెండు భాగాలు సూపర్ సక్సెస్ చేసి దేశ విదేశాల్లో కూడా విపరీతమైన పేరు సంపాదించి, తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే నేడు షూటింగ్ లో జాయిన్ కాబోతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కు ఆహ్వానం పలుకుతూ ఆర్ఆర్ఆర్ టీమ్, తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేసింది.

‘మీ రాకకోసం మేము కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాము, మీకు ఇదే మా ఆహ్వానం’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్, దర్శకుడు రాజమౌళితో అజయ్ దేవగన్ దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here