`తూటా` మూవీ రివ్యూ

0
1329
Thoota Movie Review

తూటా

విడుదల తేదీ : జనవరి  01, 2020

నటీనటులు :  ధనుష్, మేఘా ఆకాష్, సునైనా, శశి కుమార్, సెంథిల్ వీర స్వామి.

దర్శకత్వం : గౌతమ్ మీనన్

నిర్మాత‌లు : జి.రామకృష్ణా రెడ్డి, తాతా రెడ్డి

సంగీతం :  దర్బుక శివ,

సినిమాటోగ్రఫర్ : జామూన్ టి జాన్, మనోజ్ పరమహంస, ఎస్ ఆర్ కథిర్,

ఎడిటర్:  ప్రవీణ్ ఆంటోని

రఘువర‌న్ బిటెక్,B Tech, అసురన్ లాంటి చిత్రాలతో యంగ్ హీరో ధనుష్ క్రేజ్ తెలుగులోనూ విపరీతంగా పెరిగింది. ఎప్పుడూ కొత్త కథా, కథనాలతో ప్రేక్షకులను మెప్పించే ధనుష్ హీరోగా లెజెండ‌రీ డైరెక్ట‌ర్ గౌత‌మ్‌వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ‘ఎన్నై నోకి పాయ‌మ్ తోట‌’. ఈ చిత్రాన్ని తెలుగులో `తూటా` పేరుతో గొలుగూరి రామ‌కృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య‌భేరి వారి బ్యాన‌ర్‌పై జి. తాతారెడ్డి , జి స‌త్యానారాయ‌ణ‌రెడ్డి జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల చేశారు. పాజిటివ్ వైబ్స్ మధ్య విడుదలైన తూటా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
రఘు (ధనుశ్) అన్నయ్య గురుమూర్తి (శశికుమార్), ప్రేమించిన అమ్మాయిని కోల్పోతాడు. ఇంటికి దూరమైన అతని కోసం తల్లిదండ్రులు .. తమ్ముడు రఘు .. చెల్లెలు శ్రావ్య చాలా కాలంగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న లేఖ (మేఘ ఆకాశ్), కుమార్ అనే వ్యక్తి ఆశ్రయం పొందుతుంది. తనకి ఇష్టం లేకపోయినా అతని ఒత్తిడి కారణంగా సినిమాల్లో నటిస్తుంటుంది. అలా అదే కాలేజ్ క్యాంపస్ కి షూటింగ్ కొరకు వచ్చిన డెబ్యూ హీరోయిన్ లేఖ( మేఘా ఆకాష్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు రఘు. లేఖకు ఇష్టం లేకపోయినా.. తనను పెంచి పెద్ద చేసిన సేతు వీరస్వామి సినిమాలలో నటించమని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమెతో చెడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది నచ్చని లేఖని రఘు అతని ఇంటికి తీసుకెళ్తాడు. లేఖను సేతు వీరస్వామి బ్లాక్ మెయిల్ చేసి రఘు నుండి విడిపోయి మళ్లీ సినిమాల్లో నటించేలా చేస్తాడు. అయితే నాలుగేళ్ళ తరువాత ముంబై లో ఆపదలో ఉన్నలేఖను రఘు అన్నయ్య గురు(శశి కుమార్) కాపాడతాడు. అసలు నాలుగేళ్ళ తరువాత ముంబైలో లేఖకు వచ్చిన సమస్య ఏమిటి? ఆమె సమస్యను ఎప్పుడో ఇంటిలో నుండి పారిపోయిన రఘు అన్నయ్య గురు ఎలా కాపాడాడు? అసలు లేఖ, రఘు, సేతు వీర స్వామి కథలోకి గురు ఎలా ఎంటరయ్యాడు? చివరికి రఘు, లేఖ ల ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రొటీన్ సినిమాలకు కాకుండా కొంచెం విభిన్నమైన చిత్రాలకే ఎక్కువగా ప్రాధాణ్యత ఇస్తారు. ఈ క్రమంలో ధనుష్ నుండి వచ్చిన మరో విభిన్నమైన సినిమానే తూటా.. ఈ సినిమాలో కూడా తన అధ్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశాడు. సినిమా మొత్తాన్ని తన నటనతో భూజాలపై మోశాడు. మేఘా ఆకాష్ నటన కూడా బాగుంది. ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం ఉన్న యంగ్ లవర్స్ గా నటన సహజంగా ఉంది. వారిద్దరి మధ్య నడిచే రొమాన్స్, కెమిస్ట్రీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. హై ఇంటెన్స్ తో సాగే సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ లో ధనుష్ యాక్టింగ్ ఆకట్టుకొనేలా సాగింది. ధనుష్ తూటా మూవీ మొత్తం అన్నీ తానై నడిపాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఉత్కంఠ రేపే సీన్స్ లో తన సత్తా చూపించాడు. ధనుష్ ఫ్రెండ్ గా చేసిన సునైన తన పాత్ర పరిధి మేరకు మెప్పించింది. ప్రధాన విలన్ రోల్ చేసిన సేతు వీర స్వామి నటన పాత్రకు తగ్గట్టుగా వాస్తవానికి దగ్గరగా ఉంది. నటీనటులు అందరూ వారి పాత్రల బాగా నటించారు. డైరెక్టర్ చెప్పాలని అనుకున్న విషయాన్ని క్లారిటీగా చాలా చక్కగా చూపించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. కొత్తగా అనిపిస్తుంది. పోలీసుల బలం, మాఫీయా సపోర్ట్ ఉన్న విలన్స్ ని ముంబై వెళ్లి ఎదిరించే సన్నేవేశాలు బాగుంటాయి. ఎప్పుడో ఇంటి నుండి పారిపోయిన అన్నయ్య ముంబైలో ఆపదలో ఉన్న హీరోయిన్ ని కాపాడటం, తన అన్న ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని ప్రపంచానికి తెలిసేలా చెప్పడం వంటి విషయాలు ఆడియన్స్ కి కొత్తగా ఉంటాయి. అలాగే విజ‌య‌భేరి వారి బ్యాన‌ర్‌ వాల్యూస్ కూడా సినిమాలో తెలుస్తాయి. ఎక్కడా ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలగదు. మాటలు, పాటలు ప్రేక్షకులని అలరిస్తాయి.

సాంకేతిక విభాగం:
కథలో భాగంగా నేపథ్యంలో సాగే దర్బుక శివ అందించిన పాటలు బాగున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నేపధ్య సంగీతం కూడాబాగుంది. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ పరవాలేదు. యాక్షన్ థ్రిల్లర్స్ కి సుదీర్ఘమైన నిడివి కంటే కూడా క్రిస్పీగా ఉంటే నిడివి ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే అండ్ ఫిల్మ్ మేకింగ్లో ట్రెండ్ సెట్టర్ దర్శకుడు గౌతమ్ మీనన్ తన స్టైల్‌లో ఆసక్తిగా సినిమాని తెరకెక్కించాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా గల కథలను సిద్ధం చేసుకోవడం, సహజత్వానికి దగ్గరగా ఆ కథను తెరపై ఆవిష్కరించడం గౌతమ్ మీనన్ ప్రత్యేకత. అవే అంశాలకి ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను చేశాడు. ఒక వైపున ప్రమాదం అంచుల్లో తను మనసిచ్చిన అమ్మాయి. మరో వైపున ఆపదలో తన తోడబుట్టిన అన్నయ్య. ఈ ఇద్దరిని ఒకే సమయంలో కాపాడుకోవలసిన బాధ్యతను ఆయన హీరో భుజాలపై పెట్టారు. క్రైమ్‌, థ్రిల్లర్స్‌ చూసేవారికి బాగా నచ్చుతుంది. సినిమా ఎంత మేర సక్సెస్‌ అవుతుంది అనేది వేచిచూడాల్సిందే.

బాట‌మ్ లైన్: ఆక‌ట్టుకునే `తూటా’

రేటింగ్‌: 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here