నటి రేణు దేశాయ్, తన సోషల్ మీడియా మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికపుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల కుమారుడు అకీరానందన్, తన కుమార్తె ఆద్యను ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన రేణు, నేడు పవన్ కళ్యాణ్ తో తన కూతరు ఆద్య దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.
నూతన సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ తో తన కూతరు ఆద్య ఫోటోని షేర్ చేసిన రేణు, ‘కొందరు పిల్లలు ఆశ్చర్యకరంగా తమ తల్లితండ్రుల్లోని కొన్ని ముఖ్యమైన లక్షణాలను పుణికి పుచ్చుకుంటుంటారు. ఆ విధంగా ఆద్య, అచ్చంగా నాన్న, నానమ్మలకు కాపీ మాదిరిగా ఉంటుంది’ అంటూ ఒక పోస్ట్ పెట్టిన రేణు, తను నా ఫేవరెట్ కెమెరా పర్సన్ అని అన్నారు. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!


