యాదాకృష్ణ కథానాయకుడిగా గూఢచారి 786 పాటల రికార్డింగ్ 

0
169
గతంలో కథానాయకుడిగా పలు చిత్రాలు చేసిన యాదాకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ..నిర్మిస్తున్న తాజా చిత్రం గూఢచారి 786. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన రాజ్ సుందర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  కాగా ఈ చిత్రం పాటల రికార్డింగ్ యాదా కృష్ణ జన్మ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని రిథమ్ థియేటర్లో ఆరంభమైంది. గూఢచారి 786… అంటూ సాగే టైటిల్ సాంగ్ ను తొలుత రికార్డింగ్ చేసారు. దీనికి వేల్పుల వెంకటేష్ సాహిత్యంతో పాటు సంగీతాన్ని అందించారు. మిగతా పాటలను  జై సూర్య రాయడంతో పాటు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టైటిల్ పాత్రధారి, నిర్మాత యాదా కృష్ణ మాట్లాడుతూ, క్రైమ్, డిటెక్టివ్, కామెడీ,ఫ్యామిలీ డ్రామా అంశాల మేళవింపుతో సమకాలీన సంఘటనలను పొందుపరచి తీస్తున్న ఆసక్తిదాయక చిత్రమిది. ఇందులో ఆరు పాటలు, ఐదు ఫైట్స్ ఉంటాయి. పాటల రికార్డింగ్ పూర్తయిన తర్వాత నూతన ఏడాదిలో జనవరి 30న షూటింగ్ ప్రారంభిస్తాం అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ. మంచి కదాబలం కలిగిన చిత్రాన్నిచేస్తుండటం ఆనందం కలిగిస్తోందని అన్నారు.సహ నిర్మాత ఏ.రాజేందర్ మాట్లాడుతూ, గతంలో యాదాకృష్ణ నటించిన దాదాపు పది చిత్రాలను తానే నైజామ్ లో విడుదల చేసానని అన్నారు  మూడు షెడ్యూల్స్ లో చిత్రాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు తాజేష్ అలీబాబా, నిర్మాణ సారధి ఆర్.చంద్రారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నూకబోయిన వెంకట్రామ్  కెమెరామెన్ శివ తదితరులు పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here