ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల గ్రాస్ కలెక్షన్. పండగ చేసుకుంటున్న ప్రతిరోజు పండగే బయ్యర్లు

0
601

యంగ్ మెగా హీరో సాయి తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రంతో బయ్యర్లు పండగ చేసుకుంటున్నారు. డీసెంట్ మౌత్ టాక్ తో ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. నిన్న క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో ఈ చిత్రం ఆ అడ్వాంటేజ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకుంది. ఆరో రోజు కూడా మొదటి రోజుకు వచ్చినట్లుగా కలెక్షన్స్ రావడంతో చాలా చోట్ల ప్రతిరోజూ పండగే. బయ్యర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తెలుగులో ఈ చిత్రం 16 కోట్లకు అమ్ముడుపోగా ఆరు రోజుల్లోనే ఈ చిత్రం 15.36 కోట్లు రాబట్టడం విశేషం. నిన్న ఒక్క రోజే దాదాపు 2.80 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా 5.5 కోట్లకు బిజినెస్ చేయగా, ఇప్పటికే 6.5 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఏడో రోజు ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రానుంది. మరోవైపు యూఎస్ లో కూడా ప్రతిరోజూ పండగే హవా కొనసాగుతోంది. ఆరో రోజుతోనే $400K మార్క్ ను క్రాస్ చేసింది. ఫుల్ ఫన్ లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు చూసుకుంటే ప్రతిరోజు పండగే 40 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. సాయి తేజ్ కెరీర్ లో ఇంత భారీ ఎత్తున కలెక్షన్స్ రావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here