కొత్త కంటెంట్, పూర్తి ఎంటర్టైన్మెంట్ తో రూపొందిన ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రాన్ని ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేయడం ఖాయం – నిర్మాత ఎ. గురురాజ్

0
1231

సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ.గురురాజ్ నిర్మాతగా సీనియర్ నటుడు సత్యప్రకాష్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. కొత్త కథ, కథనాలతో ‘ఊల్లాల ఊల్లాల’ జనవరి 1న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సందర్భంగా ఏ. గురురాజ్ ఇంట‌ర్య్వూ..

మీరు ఇండస్ట్రీలోకి మొదట నటుడిగా వచ్చారు క‌దా! నిర్మాతగా ఎలా మారారు?
– మాది మధ్యతరగతి కుటుంబం. నేను నటుడ్ని కావాలనే కోరికతో సినిమారంగానికి రావడం జరిగింది. కానీ అప్పట్లో అవకాశం, అదృష్టం లేక నటుడ్ని కాలేకపోయాను. ఆ తరువాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చి సుఖీభవ ప్రాపర్టీస్‌ సంస్థను స్థాపించి అంచలంచలుగా ఎదిగి రియల్‌ఎస్టేట్‌రంగంలో మంచిపేరు, మంచిస్థాయిని సంపాదించుకున్నాను, నేను ఎదగడానికి ఎంతగానో తోడ్పడిన నా స్నేహితులకు, మీడియాకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు. నాకు సినిమా ఇండస్ట్రీపై ఉన్న ఫ్యాషన్‌తో చాలా సినిమాలకు గెలుపోటములతో సంబంధం లేకుండా నిర్మాతగా వ్యవహరించాను, వ్యవహరిస్తూనే ఉంటాను. ఒక నటుడు నిర్మాతగా మారినప్పుడు అతన్నే మెయిన్ క్యారెక్టర్ గా పెట్టుకుని సినిమా చేస్తాడు. కానీ నేను కథలో నేను ఏ పాత్రకు సెట్ అవుతానో ఆ పాత్ర మాత్రమే ఈ సినిమాలో చేశాను.

ఇప్పటి వరకూ మీరు నిర్మించిన చిత్రాలు ?
– మా బేన‌ర్‌లో ‘ర‌క్ష‌క‌భ‌టుడు, ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది సినిమాలు మా బేనర్ కి మంచి పేరు తెచ్చాయి. ఈ సంవత్సరం వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ కలిసి నటించిన ‘ల‌వ‌ర్స్ డే’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశాను.ఇప్పుడు ఉల్లాలా ఉల్లాలా సినిమాతో మీ ముందుకు రాబోతున్నాము.

ఈ సినిమాకి సత్య ప్రకాష్ గారినే డైరెక్టర్ గా తీసుకోవ‌డానికి రీజ‌న్ ఏంటి ?
– నిజానికి సత్య ప్రకాష్ నటుడు అవ్వుదామని ఇండస్ట్రీకి రాలేదు అండి. ఆయన డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చారు. మధ్యలో నటుడిగా బ్రేక్ రావడంతో అలా కొనసాగాడు. ఇప్పుడు దర్శకుడు రాబోతున్నాడు. సత్య ప్రకాష్ నాకు నటుడిగానే పరిచయం అయ్యారు. సినిమాల్లో ఆయన ఎంత క్రూరమైన విలనో బయట ఆయన అంత మంచి భక్తుడు. దాంతో ఆయనతో జర్నీ చేశాము. ఒక రోజు ఒక పాయింట్ ఉంది. వింటావా అంటే.. వినడం జరిగింది. పాయింట్ బాగుండటంతో సినిమాని మొదలు పెట్టాం.

సినిమాలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి ?
– ఒక డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన సినిమా ఇది. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. అలాగే కామెడీతో పాటు రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ను ఎవరు ఊహించలేరు.

మీ సినిమా పోస్టర్ ఏంటి గుర్రం అమ్మాయి ఇవన్ని చిత్రంలో నిజంగా ఉన్నాయా లేదా మీరు ఆలా క్రియేట్ చేసారా?
– అది సస్పెన్స్ గా తీసుకెళ్తున్నాం, ఆ పోస్టర్ చూస్తేనే సినిమా ఎంత వైవిధ్యంగా ఉండబోతుందో అర్ధం అవుతుంది. సినిమాకి వచ్చిన ప్రేక్షకుడికి ఆ పోస్టర్ చూసాక పెరిగిన అంచనాలన్నీ థియేటర్ లో తెరమీద దొరుకుతాయి.

ఈ సినిమాలో నటీనటుల గురించి?
– మా బేనర్ ద్వారా కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఎప్పుడూ కొత్తవారితోనే సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. అలాగే ఈ సినిమాకు కూడా ఎక్కువగా కొత్తవారిని కొత్తవారినే తీసుకోవడం జరిగింది. కానీ, ఈ సినిమాలో నటరాజ్, నూరిన్, అంకిత ఇలా నటించిన ప్రతీ ఒక్కరూ చాలా ఎక్స్‌పీరియన్సుడ్‌ ఆర్టిస్టుల్లా పెర్ఫామ్‌ చేశారు.

నిర్మాతగా మీరు ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలు పేస్ చేశారు?
– నిర్మాతగా చాల అవమానాలు ఇబ్బందులు పేస్ చేశాను. అప్పట్లో మాకు ఛాంబర్ లో కూడా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో అవకాశాలు ఎక్కువగా దొరుకుతున్నాయి. టాలెంట్ ఉన్నవారు పైకి వస్తున్నారు.

తదుపరి చిత్రాల గురించి?
– రామ్ గోపాల్ వర్మగారితో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ ఉంది. ఆయనను కలిశాను. ఆయన దగ్గరకి వెళ్లేముందు ఆయన గురించి చాలా మంది బ్యాడ్ గా చెప్పారు. కానీ ఆయన్ను కలిసాక.. బయట ఉన్న టాక్ కు ఆయన బిహేవియర్ కి పొంతన లేదు. వర్మగారు మంచి పర్సన్. అన్ని కుదిరితే ఆయనతో ఒక సినిమా చేస్తాను. అలాగే ఒక స్టార్ హీరోతో ౨౦౨౦లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here