ఆది సాయికుమార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `శ‌శి` చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

0
599

యువ క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్ పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 23. ఈ సంద‌ర్భంగా ఆది హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం `శ‌శి` ఫ‌స్ట్ లుక్‌ను పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

శ్రీనివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో యువ క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ పతాకంపై ఆర్‌.పి.వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతిలో మైక్‌తో కోపంగా ఉన్న ఆది ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

సుర‌భి, రాశీసింగ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అరుణ్ చిలువేరు సంగీతాన్ని, అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. ఒక షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలిన ఉన్న ఈ ల‌వ్ అండ్‌ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2020 వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:
ఆది సాయికుమార్‌, సుర‌భి, రాశీ సింగ్‌, వెన్నెల కిషోర్‌, తుల‌సి, జ‌య ప్ర‌కాష్‌, రాజీవ్ క‌న‌కాల‌, అజ‌య్‌, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్‌, స్వ‌ప్నిక‌, శిరీష‌, శ‌ర‌ణ్య‌, హ‌ర్ష‌, మ‌హేష్‌, కృష్ణ తేజ‌, భ‌ద్ర‌మ్‌, వేణు గోపాల‌రావు త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
స్టోరీ, డైరెక్ష‌న్‌: శ‌్రీనివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌
నిర్మాత‌లు: ఆర్‌.పి.వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీనివాస్‌
బ్యాన‌ర్‌: శ‌్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్
స్క్రీన్ ప్లే: మ‌ణికుమార్ చిన్నిమిల్లి
డైలాగ్స్‌: ఐ.ర‌వి
మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు
సినిమాటోగ్ర‌ఫీ: అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి
సాహిత్యం: చంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, అనంత శ్రీరామ్‌, వెంగి
కొరియోగ్ర‌ఫీ: విశ్వ ర‌ఘు
ఫైట్స్‌: రీల్ స‌తీష్‌
ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి
స్టిల్స్‌: కృష్ణ‌
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: సి.హెచ్‌.రాఘ‌వ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here