డిస్కోరాజా చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఢిల్లీవాలాకు అమేజింగ్ రెస్పాన్ !!!

0
1231

వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ‘డిస్కోరాజా’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ ఢిల్లీవాలాకు ’ అనే గీతాన్ని ఈరోజు (డిసెంబర్ 20) విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ ఢిల్లీవాలాకు ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియర్ పాడడం జరిగింది. హీరో పరిచయ గీతంగా విడుదలైన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. తమన్ తనదైన శైలిలో మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం కార్తీక్‌ ఘట్టమనేని, సంభాషణలు అబ్బూరి రవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here